ASBL Koncept Ambience
facebook whatsapp X

చిరూకే త‌ప్ప‌లేదు.. కిర‌ణ్ ఎంత‌

చిరూకే త‌ప్ప‌లేదు.. కిర‌ణ్ ఎంత‌

త‌మిళ‌నాట స‌రిగ్గా థియ‌ట‌ర్లు దొర‌క్క‌పోవ‌డంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం(Kiran Abbavaram) న‌టిస్తున్న క(KA) సినిమాను అక్క‌డ వారం రోజులు లేట్‌గా రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. బ్ర‌ద‌ర్(Brother), అమ‌ర‌న్(Amaran) లాంటి పెద్ద సినిమాలుండ‌టం వ‌ల్ల క సినిమాకు స‌రిపోయేలా స్క్రీన్స్ ఇవ్వ‌లేమ‌ని కోలీవుడ్ డిస్ట్రిబ్యూట‌ర్ చెప్ప‌డంతో మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌న సినిమాల‌కు ఇలాంటి ప‌రిస్థితులు ఎదురవుతున్న నేప‌థ్యంలో అక్క‌డి సినిమాల‌కు మాత్రం ఇక్కడ బాగానే వెల్‌క‌మ్ చేస్తున్నారు. క‌నీసం టైటిల్ కూడా మార్చ‌కుండా అలానే త‌మిళ పేర్లతో రిలీజ్ చేయ‌డం పై నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ వారి నుంచి మాత్రం ఎలాంటి మార్పు లేదు. అయితే 2022లో చిరంజీవి(Chiranjeevi) గాడ్ ఫాద‌ర్(god Father) రిలీజ్ టైమ్ లో కూడా ఇదే స‌మ‌స్య వ‌చ్చింది.

గాడ్ ఫాద‌ర్ కు వారం ముందు రిలీజైన పొన్నియ‌న్ సెల్వ‌న్1(Ponniyan Selvan1) కు హిట్ టాక్ రావ‌డంతో సెకండ్ వీక్ కూడా భారీ ఎత్తున థియేట‌ర్ల‌ను కంటిన్యూ చేశారు. దీంతో చిరూ సినిమాకు స్క్రీన్స్ ఇవ్వ‌డానికి కుద‌ర్లేదు. మెగాస్టార్(Megastar) చిరంజీవికే ఈ స‌మ‌స్య త‌ప్ప‌న‌ప్పుడు కిర‌ణ్ అబ్బ‌వరం లాంటి అప్ క‌మింగ్ హీరోకు మాత్రం మంచి స్వాగ‌తం దొరుకుతుంద‌ని ఎలా అనుకుంటాం. మ‌నం త‌మిళ సినిమాలను నెత్తిన పెట్టుకుంటుంటే వారు మాత్రం క‌నీసం డబ్బింగ్ సినిమాల‌కు కావాల్సిన స్క్రీన్స్ ఇవ్వ‌డానికి కూడా బెట్టు చేస్తున్నారు. ఈ ప‌ద్ధ‌తిలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ అది జ‌ర‌గాలంటే టాలీవుడ్ లోని పెద్ద‌లు పూనుకోవాలి. మ‌రి ఈ ప‌ద్ధ‌తి ఎప్ప‌టికి మారుతుందో చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :