11 నెలల్లోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత : కిషన్ రెడ్డి
సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కార్యశాల నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు, రిటర్నింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి సంస్థాగత ఎన్నికల వ్యవస్థ ఊపిరి అని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు.
మహిళ, యువత, రైతుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయని తెలిపారు. 11 నెలల్లోనే ఈ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిదని తెలిపారు.
Tags :