రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్ట్టుపట్టిపోతోంది : కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమిటని ప్రశ్నించారు. బెదిరింపులు, తిట్ల పురాణాల తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదన్నారు. సమస్యలపై మాట్లాడితే నా డీఎన్ఏ ఏంటని మాట్లాడుతున్నారు. నాది భారతీయ జనతా పార్టీ డీఎన్ఏ. మిగతవారి మాదిరిగా పది పార్టీలు తిరిగిన డీఎన్ఏ కాదు. డిసెంబరు 1 నుంచి 5 వరకు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా పాలనపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలి. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ నష్టపోతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు.
Tags :