కలెక్టర్ పై దాడి వెనుక ఉన్నది అతనే.. కొండా సురేఖ..
రెండు నిందలు, మూడు ఆరోపణలు అన్నట్టు సాగుతోంది తెలంగాణ రాజకీయం. కథ కొతికాలంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ చుట్టూ వెల్లువెత్తుతున్న ఆరోపణల గురించి తెలిసింది.. తాజాగా మరొకసారి లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న కేటీఆర్ హస్తం ఉంది అంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా కొండా సురేఖ కేటీఆర్ విషయంలో తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొకసారి ఆమె కేటీఆర్ గురించి విమర్శించడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కలెక్టర్ పై జరిగిన దాడిలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని. అమాయకులను బలి చేయడం కోసం, తన స్వార్ధపూరితమైన ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత దూరమైనా వెళ్తారు అంటూ కొండా సురేఖ విమర్శించారు. తన కుట్టు బయటపడకూడదు అనే ఉద్దేశంతో లగచర్ల ఘటనతో సంబంధం ఉన్న అధికారులను విదేశాలకు పంపించారంటూ ఆరోపించారు.
ఫోన్ టాపింగ్ ద్వారా బయటపడినటువంటి విషయాలు ఈ విషయంలో కేటీఆర్ పాత్రను స్పష్టం చేస్తున్నాయని కొండా సురేఖ పేర్కొన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలయ్యిందని.. భవిష్యత్తు తరం ఆరణాన్ని తీర్చే భారం మోస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం పాలనలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలకు చేసిన మంచి ఏమిటి అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే ఆ పార్టీ పనిచేసింది అని ఆమె అన్నారు. అంతేకాదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దుష్ట పాలన అంతమందించి సంవత్సరం గడుస్తున్న శుభ సందర్భంగా మహిళలతో ఓ విజయోత్సవ సభ కూడా నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేశారు. మన దేశం మహిళా లోకానికే ఆదర్శవంతమైన ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ సభ నిర్వహించి మహిళలు స్ఫూర్తిని పెంచుతామని పేర్కొన్నారు.