ASBL Koncept Ambience
facebook whatsapp X

కవితపట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... కేటీఆర్‌ సమర్థిస్తారా?

కవితపట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... కేటీఆర్‌ సమర్థిస్తారా?

మహిళా మంత్రిని అని కూడా చూడకుండా అవమానిస్తూ తనపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా శ్రేణులు దారుణమైన పోస్టులు పెట్టాయని అన్నారు. అధికారం కోల్పోయిన  బాధలో బీఆర్‌ఎస్‌ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని, కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే,  కేటీఆర్‌ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. డబ్బులిచ్చి మహిళలను ట్రోల్‌ చేయించడం సరికాదని హెచ్చరించారు.  మొదట్నుంచి మహిళలను కేటీఆర్‌ దారుణంగా అవమానిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే, బస్సుల్లో డిస్కో డ్యాన్స్‌ చేస్తున్నారని అవమానించారు. చేనేత కార్మికులకు కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ప్రభుత్వ విధానాల పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటాం. మహిళను వ్యక్తిగతంగా అవమానించడం సరికాదు అని అన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :