ASBL Koncept Ambience
facebook whatsapp X

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు ... ఆయన తీరుతో

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు ... ఆయన తీరుతో

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి కొండా  సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు.  కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకొంటే, మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సురేఖ మీడియాతో మాట్లాడుతూ బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. మంత్రి సీతక్క, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు బీఆర్‌ఎస్‌లో పనిచేశా. నా వ్యక్తిత్వం అందరికి తెలుసు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. రాజకీయ విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలి. వ్యక్తిత్వం దెబ్బతీసేలా  ప్రవర్తించవద్దు అని సురేశ్‌ హితవు పలికారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :