ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆవిడను అలా వదిలేయకండిరా..!!

ఆవిడను అలా వదిలేయకండిరా..!!

ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) ఇటీవల అత్యంత సంచలనం కలిగించిన సంఘటనల్లో కోనేటి ఆదిమూలం (Koneti Adimulam) ఇష్యూ ఒకటి. సత్యవేడు (Sathyavedu) నుంచి టీడీపీ (TDP) తరపున గెలిచిన ఆయనపై లైంగిక వేధింపుల (Sexual harassment) ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు చేసింది కూడా ఓ టీడీపీ మహిళా నేత. ఆమె ఏకంగా ప్రెస్ మీట్ (Press meet) పెట్టి ఈ విషయాలు వెల్లడించింది. దానికి సంబంధించిన వీడియోలను (Videos) కూడా ఆమే స్వయంగా మీడియాకు (Media) ఇచ్చింది. దీంతో ఇది పెద్ద దుమారమే రేపింది. ఆ ఎమ్మెల్యేని (MLA) పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేసింది టీడీపీ. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి పోలీసులు (Tirupati Police) కేసు నమోదు చేశారు.

తిరుపతి పోలీసులు కేసు పెట్టిన తర్వాత సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను విచారించేందుకు నోటీసులు ఇచ్చారు. ఇంతలో ఆయనకు ఆరోగ్యం బాగలేక చెన్నైలో (Chennai) ఓ ఆసుపత్రిలో చేరారు. విచారణలో భాగంగా బాధిత మహిళకు ఆరోగ్య పరీక్షలు చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. రెండుసార్లు తప్పించుకున్న తర్వాత మూడోసారి బలవంతంగా పరీక్షలకు ఒప్పుకుంది. ఇంతలో తనను విచారించకుండానే దోషిగా చేసే ప్రయత్నం చేస్తున్నారని.. తనపై చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ కోనేటి ఆదిమూలం హైకోర్టులో (High Court) పిటిషన్ వేశారు.

ఇంతలో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. బాధితురాలు హైకోర్టుకు వెళ్లి ‘కోనేటి ఆదిమూలం మంచోడు.. ఆయన నాతో అలా ప్రవర్తించలేదు.. ఆయనపైన నేను చేసిన ఆరోపణలన్నీ నిజం కాదు.. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటున్నాం.. అనుమతించండి..’ అంటూ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 25వ తేదీన నిర్ణయం చెప్తామంటూ వాయిదా వేసింది. హైకోర్టులో ఇలా జరిగిందని తెలిసిన వెంటనే రాష్ట్రమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏంటి.. ఇది నిజమా.. ఆని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది.

సరే ఇద్దరి మధ్యా ఏమీ జరగలేదనుకుందాం.. మరి అప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు ఇచ్చిన వీడియోల సంగతేంటి..? అతనిపై బురద జల్లి ఆతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించి.. ఇప్పుడు తూచ్ అంటే సరిపోతుందా..? ఇలా తప్పుడు ఆరోపణలు చేసి తప్పయిపోయింది క్షమించండి.. అంటే వదిలేద్దామా..? పోలీసులు, లాయర్లు, హైకోర్టు జడ్జిలు ఎన్ని గంటల సమయాన్ని వృధా చేసుకున్నారు.? ఇలాంటి ఫేక్ పర్సన్స్ ని ఇలా వదిలేస్తే మున్ముందు ఇలాంటివి పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. కచ్చితంగా ఇలాంటి వాళ్లకు శిక్ష పడాలి. అప్పుడే కాస్త భయముంటుంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :