ASBL Koncept Ambience
facebook whatsapp X

బ‌న్నీతో త‌ప్ప‌క సినిమా చేస్తా: కొర‌టాల‌

బ‌న్నీతో త‌ప్ప‌క సినిమా చేస్తా: కొర‌టాల‌

టాలీవుడ్ లో రైట‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి త‌ర్వాత డైరెక్ట‌ర్ గా ఎదిగి త‌న‌కంటూ టాలీవుడ్ లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కొర‌టాల శివ‌. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌భాస్, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోల‌ను డైరెక్ట్ చేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఇప్ప‌టికే కొర‌టాల సినిమా చేయాల్సింది.

వీరిద్ద‌రి కాంబోలో గ‌తంలో ఓ సినిమా అనౌన్స్ అయిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను కూడా అప్ప‌ట్లో రిలీజ్ చేశారు. ఆ సినిమా క్యాన్సిల్ అవ‌డం వ‌ల్లే కొర‌టాల, ఎన్టీఆర్ తో దేవ‌ర తీశాడు. అయితే బ‌న్నీతో అప్పుడు సినిమా క్యాన్సిల్ అయిన‌ప్ప‌టికీ త‌మ కాంబోలో ఓ సినిమా క‌చ్ఛితంగా రానున్న‌ట్లు కొర‌టాల తెలిపాడు.

త‌న మొద‌టి సినిమా మిర్చిని బ‌న్నీ ఫ్యామిలీతో చూసి ఎంతో ఎంజాయ్ చేశాడ‌ని, అప్ప‌ట్నుంచే త‌నతో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ని, తాను కూడా బ‌న్నీతో సినిమా చేయ‌డానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నాన‌ని, కొన్ని కార‌ణాల వ‌ల్ల త‌మ క‌ల‌యిక‌లో సినిమా కుద‌ర‌లేద‌ని కానీ త్వ‌ర‌లోనే త‌మ కాంబోలో సినిమా ఉండ‌నుంద‌ని కొర‌టాల క్లారిటీ ఇచ్చాడు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :