ASBL Koncept Ambience
facebook whatsapp X

రాజ‌మౌళి బాట‌లోనే కొర‌టాల‌

రాజ‌మౌళి బాట‌లోనే కొర‌టాల‌

ఆచార్య(acharya) ప‌రాజ‌యం నుంచి కోలుకుని దేవ‌ర(Devara) సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న జోష్ లో ఉన్నాడు కొర‌టాల‌(koratala). దేవ‌ర‌2(devara2) కోసం కాస్త ఎక్కువ టైమ్ ప‌ట్టేలా ఉండ‌టంతో ఈ గ్యాప్ లో మ‌రో హీరోతో ఇంకో సినిమా చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్(NTR) ముందుగా వార్2(War2), ప్ర‌శాంత్ నీల్(Prasanth Neel) తో సినిమాల‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఎంత‌లేద‌న్నా ఈ రెండు సినిమాల‌ను పూర్తి చేయ‌డానికి 2025 అయిపోయింది.

ఇంత టైట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ దేవ‌ర‌2(Devara2) కు డేట్స్ ఇవ్వ‌లేడు కాబ‌ట్టి అప్ప‌టివ‌ర‌కు కొర‌టాల ఖాళీగా ఉంటాడా అంటే ఆయ‌న స‌న్నిహితులు చెప్తున్న దాని ప్ర‌కారం కొర‌టాల తానేం చేయాల‌నే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్న‌ట్లు సమాచారం. ఆయ‌న స‌న్నిహితులు చెప్తున్న దాని ప్ర‌కారం కొర‌టాల నెక్ట్స్ క‌మిట్‌మెంట్ ఇంకా ఎవ‌రికీ ఇవ్వ‌లేదు. బాహుబ‌లి1(Baahubali1) రిలీజ‌య్యాక రాజ‌మౌళి(Rajamouli) కేవ‌లం బాహుబ‌లి2(baahubali2) మీదే ఫోక‌స్ పెట్ట‌డం వ‌ల్ల ఆ సినిమాకు మంచి ఎఫెక్ట్ వ‌చ్చింది.

రాజ‌మౌళి లాగానే కొర‌టాల శివ కూడా కొన్ని నెల‌ల విశ్రాంతి తీసుకుని త‌ర్వాత దేవ‌ర2 స్క్రిప్ట్ లో మార్పులు, ప్రీ ప్రొడ‌క్ష‌న్, క్యాస్టింగ్ వ్య‌వ‌హారాల‌న్నీ చూసుకోబోతున్నార‌ట‌. అంటే సీక్వెల్ రిలీజయ్యే వ‌ర‌కు కొర‌టాల మ‌రో సినిమాను చేయ‌న‌ట్లే. మొత్తానికి దేవ‌ర‌2 కోసం గ్రౌండ్ సెట్ అవుతోంది. దేవ‌ర‌2 అంద‌రి అంచ‌నాల‌ను మించేలా కొర‌టాల రెడీ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.  

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :