ASBL Koncept Ambience
facebook whatsapp X

రెండో పెళ్లికి రెడీ అయిన క్రిష్?

రెండో పెళ్లికి రెడీ అయిన క్రిష్?

టాలీవుడ్ లో డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి(Krish Jagarlamudi)కి ప్ర‌త్యేక క్రేజ్ ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి సినిమానూ డిఫ‌రెంట్ జాన‌ర్ లో తెర‌కెక్కిస్తూ అల‌రించే క్రిష్(Kish) త‌న సినిమాల‌తో సామాజిక సందేశాన్ని ఇస్తూ మెప్పిస్తుంటారు. గ‌మ్యం(Gamyam) సినిమాతో డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన క్రిష్ త‌ర్వాత వేదం(Vedam) సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు.

కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్(Krishnam Vande Jagadgurum), కంచె(Kanche), గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి(Gauthami Putra Satakarni) సినిమాల‌తో త‌న టాలెంట్ ను నిరూపించుకున్న క్రిష్ నుంచి కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అనుష్క‌(Anushka)తో ఘాటి(Ghaati) సినిమా చేస్తున్న క్రిష్ మ‌రికొద్ది రోజుల్లో ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే క్రిష్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ప‌లు వార్త‌లు ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

క్రిష్ రెండో పెళ్లికి రెడీ అయ్యార‌ని త్వ‌ర‌లోనే వారి పెళ్లి జ‌ర‌గ‌నుందని వార్త‌లొస్తున్నాయి. 2016లో ర‌మ్య(Ramya) అనే డాక్ట‌ర్ ను పెళ్లి చేసుకున్న క్రిష్ ఐదేళ్ల త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అప్ప‌ట్నుంచి సింగిల్ గా ఉంటున్న క్రిష్ ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించ‌డానికి రెడీ అయ్యాడ‌ని ఊహాగానాలు వినిప‌స్తున్నాయి. క్రిష్ ఇప్పుడు పెళ్లి చేసుకోనుంది కూడా డాక్ట‌ర్‌నే అని, వ‌చ్చే వారం సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకుని డిసెంబ‌ర్ లో పెళ్లి చేసుకోనున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజమెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది.  

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :