ASBL NSL Infratech

మ‌రో ఆఫ‌ర్ ప‌ట్టేసిన కృతి

మ‌రో ఆఫ‌ర్ ప‌ట్టేసిన కృతి

 

మొద‌టి సినిమా ఉప్పెన తోనే మంచి హిట్ అందుకున్న క‌న్న‌డ భామ కృతి శెట్టికి రెండో సినిమా శ్యామ్ సింగ‌రాయ్ ద్వారా కూడా మంచి హిట్ ను అందుకుంది. కానీ ఆ త‌ర్వాత అమ్మ‌డి నుంచి వ‌చ్చిన సినిమాల‌న్నీ ఫ్లాపులు, డిజాస్ట‌ర్ల‌వ‌డంతో కృతికి ఆఫ‌ర్లు రావ‌డం త‌గ్గిపోయాయి. దీంతో అమ్మ‌డికి కెరీర్లో గ్యాప్ త‌ప్ప‌లేదు.

చాలా గ్యాప్ త‌ర్వాత రీసెంట్ గా మ‌న‌మే సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది కృతి. ఆ సినిమా కూడా అనుకున్న ఫ‌లితాన్నివ్వ‌క‌పోవ‌డంతో ఫ్లాప్ గానే మిగిలింది. తెలుగులో త‌ను చేసిన ప్ర‌తి సినిమా ఫెయిల‌వుతున్నా, ఆఫ‌ర్లు రాక‌పోయినా త‌మిళం నుంచి మాత్రం కృతికి బాగానే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అక్క‌డ ప‌లు సినిమాల‌తో కృతి బిజీగా ఉంది.

ఇప్ప‌టికే జ‌యం ర‌వితో జెనీ అనే ఫాంట‌సీ సినిమా చేస్తున్న కృతి, ల‌వ్ టుడే ఫేమ్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ తో ఎల్ఐసీ లో కూడా న‌టిస్తోంది. రీసెంట్ గా కార్తీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కృతి తాజాగా మ‌రో త‌మిళ ఆఫ‌ర్ ను ప‌ట్టేసిన‌ట్లు స‌మాచారం. సెల్వ‌మ‌ణి సెల్వ‌రాజ్ అనే కొత్త డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా చేయ‌బోయే సినిమాలో కృతి హీరోయిన్ గా ఎంపికైంద‌ట. ఈ సినిమా త‌మిళంతో పాటూ తెలుగులో కూడా ఒకేసారి తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ సినిమాకు రానా నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు స‌మాచారం.  

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :