కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన కేటీఆర్, హరీశ్ రావు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు.. హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్ భవన్లో ఉన్న టీకేఫ్లో పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ ఇద్దరు నేతలు టేబుల్‌పై ఎదురెదురుగా కూర్చొని, సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతకుముందు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని మండిపడ్డారు. పార్లమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, ఇది సిగ్గుచేటు విషయమని అన్నారు. మూసీ ప్రాజెక్టుపై కేంద్రానికి, పార్లమెంట్‌కు ఒకటి చెప్పిన రాష్ట్ర సర్కారు.. ఇక్కడ మరో విధానం అమలు చేస్తోందని మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని కేంద్రానికి చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. ఆ పని చెయ్యడం లేదని ఆరోపించారు.
Tags :