ASBL NSL Infratech
facebook whatsapp X

ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్బ్‌ర్రా, బ్రిస్బేన్‌, ఆడిలైడ్‌ పట్టణాలలో బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన వేడుకలో వినయ్‌ సన్నీ గౌడ్‌ మాట్లాడుతూ  తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, 10 సంవత్సరాల పాటు బంగారు తెలంగాణను సాధించే దిశగా కేటీఆర్‌ కృషి చేశారన్నారు. చరిత్రలో కేటీఆర్‌ పాత్ర నిలిచిపోతుందని, పార్టీ ఓడిన, గెలిచిన బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా ఎప్పటికీ పార్టీతోనే ఉంటుందని తెలిపారు. గిఫ్ట్‌ ఏస్మైల్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో వినయ్‌ సన్నీ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేవారు. ఈ వేడుకలో బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా కోక్‌ కమిటి నాయకులు ప్రవీణ్‌ లేదెళ్ళ, ఉదయ్‌ సింహారెడ్డి, సాయి కృష్ణ కల్వకుంట్ల, రాకేష్‌, సూర్యారావు, అశోక్‌, బాలరాజు, వేణునాథ్‌, సాయి యాదవ్‌, మిస్కీన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :