మేము రెడ్ సిగ్నల్ ఇస్తే.. మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం సీఎం నిర్వహించిన ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన పనులు అంటూ ఆయన ఓ తప్పుడు నివేదిక విడుదల చేశారని ఆరోపించారు. సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా? అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే అప్పటి సీఎం కేసీఆర్ తిరస్కరించారు. అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే, మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారు అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Tags :