తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం .. తీసుకోవడం లేదు?
అంతర్జాతీయంగా మళ్లీ అదానీ వ్యవహారం బయటపడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేవంలో కేటీఆర్ మాట్లాడుతూ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇది వెలుగు చూసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. మా పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అదానీ తెలంగాణకు రాలేదు. కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఆయనకు రెడ్‌కార్పెట్ పరిచారా? రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు అదానీకి అప్పగిచేందుకు సీఎం ప్రయత్నించారు. సిల్క్ యూనివర్సిటీకి ఆయన రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. వ్యాపారవేత్తలు రూ.40 వేల కోట్ల విరాళాలు ఉచితంగా ఇవ్వరని రాహుల్ గాంధీ అన్నారు. జాతీయ పార్టీకి ఓ జాతీయ విధానం ఉండాలి. అదానీతో చేసుకున్న ఒప్పందాలను కెన్యా రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడం లేదు? రాహుల్ గాంధీకి చిత్తశుధ్ది ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి అని డిమాండ్ చేశారు.