KTR : వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలి ... లేకపోతే
తెలంగాణ తల్లులపై ఏంటీ దుర్మార్గం? ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు (Asha workers) హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారీ తీసిన విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న ఆశాలను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మాతృ మూర్తులపై పురుష పోలీసులతో దౌర్జన్యమా? ఏం పాపం చేశారని ఆశా వర్కర్లను రోడ్డుపై లాగిపారేశారు? ఇందిరమ్మ రాజ్యం అణచివేతలు, అక్రమ అరెస్టులేనా? ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే వారి ఆగ్రహ జ్వాలలను తట్టుకోలేరు అని హెచ్చరించారు.
Tags :