కేసీఆర్‌ను ఫినిష్ చేస్తానన్న వాళ్లే ఫినిష్ అయిపోయారు: రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారన్న కేటీఆర్.. కేసీఆర్ అంటే ఒక సామాన్య వ్యక్తి కాదని అన్నారు. రేవంత్ మాదిరే గత 24 ఏళ్లలో ఎంతో మంది ప్రగల్భాలు పలికారని గుర్తుచేసిన కేటీఆర్.. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేసి, కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామన్నవారే ఫినిష్ అయిపోయారని వార్నింగ్ ఇచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట పిడికెడు మంది మాత్రమే ఉన్నారని గుర్తుచేశారు. అదే వ్యక్తి వెనుక ఇప్పుడు లక్షలాది కార్యకర్తలు ఉన్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కులంగా, సంక్షేమం మతంగా, అందరినీ కలుపుకునిపోయి పాలన సాగించారని పేర్కొన్నారు. ఆ సమయంలో అన్ని రంగాల్లో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు.