ASBL Koncept Ambience
facebook whatsapp X

లాల్ స‌లామ్‌కు రిపేర్లు

లాల్ స‌లామ్‌కు రిపేర్లు

ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించిన లాల్ స‌లామ్ సినిమా కొన్ని నెల‌ల కింద‌ట రిలీజైంది. ఈ సినిమా వ‌చ్చింద‌నే సంగ‌తే దాదాపు చాలా మంది మ‌ర్చిపోయారు. అన్ని భాష‌ల్లో డిజాస్ట‌ర్‌గా మిగిలిన ఈ సినిమాలో ర‌జినీది క్యామియో అనే పేరే కానీ ఆయ‌న పాత్ర నిడివి చాలా ఎక్కువే ఉంది. సినిమా ఫ‌స్ట్ షో కే నెగ‌టివ్ టాక్ రావ‌డ‌వంతో ఆడియ‌న్స్ థియేట‌ర్ల వైపు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో లాల్ స‌లామ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కు భారీ న‌ష్టాలు మిగిల్చిన సినిమాగా కొత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది. అయితే సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ లాల్ స‌లామ్ సినిమా ఇప్ప‌టికీ ఓటీటీలోకి రాలేదు. ఇక‌పై రాద‌ని ఫ్యాన్స్ ఫిక్స‌య్యారు. క‌ట్ చేస్తే ఇప్పుడీ సినిమాకు రిపేర్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఎడిటింగ్ లో మిస్సైన ఫుటేజ్‌ని క‌లిపి స్క్రిప్ట్ ప్ర‌కారం ముందు రాసుకున్న వెర్ష‌న్ కు అనుగుణంగా సినిమా ఉండేలా వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. అంతేకాదు, ఈ సినిమాకు ఏ మాత్రం అద‌నంగా ఛార్జ్ చేయ‌కుండా రెహ‌మాన్ మ‌రోసారి స్పెష‌ల్ గా రీరికార్డింగ్ చేయ‌డానికి ఒప్పుకోవ‌డం అస‌లైన ట్విస్ట్. ఇప్ప‌టికే రెహ‌మాన్ వ‌ర్క్ పూర్తైన‌ట్లు స‌మాచారం. అయితే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగాక లాల్ స‌లామ్‌కు ఇప్పుడెందుకు ఇవ‌న్నీ చేయ‌డమ‌ని కొంద‌రు అంటున్న‌ప్ప‌టికీ ఐశ్వ‌ర్య రజ‌నీకాంత్ మాత్రం ఈ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఓటీటీలో లాల్ స‌లామ్ క‌చ్ఛితంగా మంచి హిట్ట‌వుతుంద‌ని ఆమె న‌మ్ముతుంది.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :