ASBL NSL Infratech

మెగాస్టార్ మాట‌కు ఓకే అన్న లారెన్స్

మెగాస్టార్ మాట‌కు ఓకే అన్న లారెన్స్

కొరియోగ్రాఫ‌ర్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైమ్ లో డైరెక్ట‌ర్ గా మారి మాస్ లాంటి భారీ హిట్ అందుకున్నాడు రాఘ‌వ లారెన్స్. ఆ త‌ర్వాత ముని సిరీస్ నుంచి హీరో క‌మ్ డైరెక్ట‌ర్ గా బాగా బిజీ అయ్యాడు. దీంతో ఎవ‌రికీ స్పెష‌ల్ గా కొరియోగ్ర‌ఫీ చేసే టైమ్ లేక‌పోయింది. కానీ చిరంజీవి అంటే లారెన్స్ కు ఎంతో అభిమానం. సైడ్ డ్యాన్స‌ర్ గా ఉన్న త‌న‌కు హిట్ల‌ర్ రూపంలో మంచి బ్రేక్ ఇచ్చి ఈ స్థాయిలో నిల‌బెట్టింది చిరూనే అని ఆయ‌న వ‌ల్లే త‌ను ఈ స్థాయిలో ఉన్నాన‌ని చెప్తూ ఉంటాడు. అందుకే ఖైదీ నెం.150 లో ర‌త్తాలు ర‌త్తాలు సాంగ్ ను కంపోజ్ చేయమ‌ని అడ‌గ్గానే మ‌రో ఆలోచ‌న లేకుండా చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి ఆ ప‌ని పూర్తి చేసుకుని వెళ్లిన‌ట్లు ఓ సంద‌ర్భంలో చెప్పాడు లారెన్స్.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎప్పుడూ వీరి కాంబో కుద‌రలేదు. ఇప్పుడు తాజాగా విశ్వంభ‌ర‌లో ఓ డ్యాన్స్ బీట్ ఉంద‌ట‌. దానికి లారెన్స్ అయితేనే న్యాయం చేస్తాడ‌ని భావించిన చిరూ, స్వ‌యంగా లారెన్స్ కు ఫోన్ చేసి అడ‌గ‌డంతో ఈ కాంబో ఫిక్స్ అయింద‌ని తెలుస్తోంది. ఇంకా అఫీషియ‌ల్ గా చెప్ప‌లేదు కానీ నిజ‌మే అంటున్నారు. నెక్ట్స్ ఇయ‌ర్ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :