ASBL Koncept Ambience
facebook whatsapp X

చాన్నాళ్ల‌ త‌ర్వాత టాలీవుడ్ డైరెక్ట‌ర్ తో లారెన్స్ మూవీ

చాన్నాళ్ల‌ త‌ర్వాత టాలీవుడ్ డైరెక్ట‌ర్ తో లారెన్స్ మూవీ

ఫామ్ లో లేని డైరెక్ట‌ర్ తో సినిమా అంటే ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది. అన్నీ బాగుండి సినిమా హిట్ అయితే బానే ఉంటుంది కానీ తేడా కొడితే మాత్రం ఎక్క‌డ లేని ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ కెరీర్లో ఒక్క రాక్ష‌సుడు త‌ప్ప ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో హిట్ లేదు. అది కూడా త‌మిళ సినిమాకు రీమేక్ గా వ‌చ్చింది.

ఎంత రీమేక్ అయిన‌ప్ప‌టికీ దాన్ని ఆడియ‌న్స్ కు న‌చ్చేలా తీయ‌డం అంత ఈజీ కాదు. ఆ విష‌యంలో ఆయ‌న టాలెంట్ ను అభినందించాల్సిందే. ఆ త‌ర్వాత ర‌వితేజతో ఖిలాడీ తీసి డిజాస్ట‌ర్ అందుకున్నాడు. ఇప్పుడీ డైరెక్ట‌ర్ తో రాఘ‌వ లారెన్స్ తన 25వ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. భారీ బ‌డ్జెట్ తో కోనేరు నిర్మాణ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తుంది.

ఈ మ‌ధ్య తెలుగు డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేయ‌డం మానేసిన లారెన్స్ ఈ సినిమా ఓకే చేయ‌డానికి కార‌ణం ఇది బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కిల్ కి రీమేక్ కావడ‌మే. ఒక్క రాత్రి ట్రైన్ లో జ‌రిగే సంఘ‌ట‌న‌తో రూపొందిన ఈ వ‌యొలెంట్ డ్రామాకు మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. నిజానికి ఈ సినిమా కోసం టాలీవుడ్ లో ఇద్ద‌రు ముగ్గురు టైర్2 హీరోలు చాలా గ‌ట్టిగా ట్రై చేశార‌ని లీకులందాయి కానీ ఇప్పుడా అవ‌కాశాన్ని లారెన్స్ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం కాంచ‌న‌4 వ‌ర్క్స్ లో లారెన్స్ బిజీగా ఉన్నాడు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :