ASBL Koncept Ambience
facebook whatsapp X

ఐసియా ప్రతినిధులకు మంత్రి లోకేశ్‌ ఆహ్వానం.. ఆంధ్రాలో

ఐసియా ప్రతినిధులకు మంత్రి లోకేశ్‌ ఆహ్వానం.. ఆంధ్రాలో

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చి. అన్ని రకాల పరిశ్రమలకు అనువైన వాతావరణం నెలకొల్పుతున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి సంస్థలను సాధించేందుకు ఆయన ఢల్లీిలో ఇండియన్‌ సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ప్రతినిధులు,  కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్‌ చౌధరిలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

తొలుత ఐసీఈఏ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్ర అధ్యక్షతన జరిగిన సెల్యూలర్‌, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చడానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. తాము ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో దేశంలోని రాష్ట్రాలతో మాత్రమే కాకుండా దిగ్గజ దేశాలతో పోటీపడుతున్నట్లు తెలిపారు. పేరొందిన పారిశ్రమికవేత్తలతో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసి పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న విధానపరమైన సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల కోసం అనువైన విధానాన్ని రూపొందించి ప్రోత్సాహకాలు అందించబోతున్నామని, అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖపట్నాన్ని ఐటీ పవర్‌హౌస్‌గా, అంతర్జాతీయ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలని, తిరుపతిని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చాలన్న లక్ష్యసాధనకు సహకరించాలని సెల్యులర్‌, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను కోరారు.

 


 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :