ASBL Koncept Ambience
facebook whatsapp X

"లవ్ రెడ్డి" లాంటి మంచి ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకులు హార్ట్ ఫుల్ గా సపోర్ట్ చేస్తారు - కిరణ్ అబ్బవరం

"లవ్ రెడ్డి" లాంటి మంచి ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకులు హార్ట్ ఫుల్ గా సపోర్ట్ చేస్తారు - కిరణ్ అబ్బవరం

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్  బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "లవ్ రెడ్డి" . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి,  మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా "లవ్ రెడ్డి" సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా  "లవ్ రెడ్డి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ మదన్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ - మా హీరో అంజన్ రామచంద్ర పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో కష్టపడుతున్నాడు. ఎవరి సపోర్ట్ లేకుండా తన మొదటి సినిమా లవ్ రెడ్డిని ఘనంగా రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. ఆయనను చూసే మేమంతా ఇన్స్ పైర్ అవుతున్నాం. ప్రొడ్యూసర్ గా కన్నా అంజన్ ఫ్యామిలీ మెంబర్స్ గా మేము చెప్పుకుంటాం. కంటెంట్ బాగున్న సినిమా కొత్త హీరోనా స్టార్ హీరోనా అనేది ప్రేక్షకులు చూడరు. కంటెంట్ పరంగా లవ్ రెడ్డి పెద్ద సినిమానే. మీ ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ యశస్విని మాట్లాడుతూ - లవ్ రెడ్డి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే ప్రతి అమ్మాయి తననే పోల్చుకుంటుంది. అలాగే హీరో క్యారెక్టర్ తో అబ్బాయిలు రిలేట్ అవుతారు. సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ..అన్నీ బాగుంటాయి. లవ్ రెడ్డి సినిమాను ఈ నెల 18న థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

యాక్టర్ గణేష్ మాట్లాడుతూ - లవ్ రెడ్డి సినిమాలో హీరో బ్రదర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ  క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు స్మరణ్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతున్నా. రియల్ లైఫ్ లో ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ కు కనెక్ట్ అవుతారు. ప్రతి ఇంట్లో నాలాంటి బ్రదర్ ఒకరు ఉంటారు అని అనుకుంటారు. లవ్ రెడ్డి సినిమాను మీరంతా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

యాక్టర్ తిలక్ మాట్లాడుతూ - మాది బెంగళూరు. అక్కడ థియేటర్ ఆర్ట్స్ చేశాను. తెలుగులో నా ఫస్ట్ ఫిల్మ్ లవ్ రెడ్డి. ఇలాంటి మంచి మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది. అన్నారు.

నటి జ్యోతి మాట్లాడుతూ - ఈ రోజు మా లవ్ రెడ్డి ఈవెంట్ కు వచ్చిన కిరణ్ అబ్బవరం గారికి థ్యాంక్స్. ఆయన సినిమాలన్నీ చూస్తుంటాను. ఇప్పుడు క మూవీలో మాస్ లుక్ లోకి మారిపోయారు. చాలా బాగున్నారు. లవ్ రెడ్డి మూవీలో ఓ మంచి క్యారెక్టర్ చేశాను. మా సినిమా వావ్ అనేలా ఉంటుంది. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ మాట్లాడుతూ - లవ్ రెడ్డి సినిమాకు క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాం. మ్యూజిక్ కోసం చాలా డిస్కషన్స్ చేసుకున్నాం. సాంగ్స్ కు మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాను కూడా ఇలాగే సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ స్మరణ్ రెడ్డి మాట్లాడుతూ - హీరో కిరణ్ అబ్బవరం నాకు చాలాకాలంగా తెలుసు. ఆయన ఎంతో డెడికేషన్ తో కష్టపడి ఈరోజు ఒక మంచి పొజిషన్ కు రావడం హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారికి కిరణ్ ఒక ఇన్స్ పిరేషన్ గా నిలుస్తున్నారు. అంజన్ రామచంద్ర నేను రెండేళ్ల కిందట లవ్ రెడ్డి మూవీ స్టార్ట్ చేశాం. అంజన్ మా మూవీ ముందుకు వెళ్లేలా ఎంతో కష్టపడ్డాడు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ పది మంది అయ్యారు. ఎంతో నమ్మకంతో మా మూవీని రిలీజ్ దాకా తీసుకొచ్చాం. జీఎస్ కే మీడియా శ్రీనివాస్ అన్న ఎంతో సపోర్ట్ చేసి మంచి ప్రమోషన్ చేస్తున్నారు. రీసెంట్ గా హిందూపూర్ లో ప్రివ్యూస్ వేశాం. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. హార్డ్ హిట్టింగ్ మూవీగా లవ్ రెడ్డి మీ ముందుకు వస్తోంది. శ్రావణి పర్ ఫార్మెన్స్ చూస్తే ఈ క్యారెక్టర్ ఆమె తప్ప మరో హీరోయిన్ చేయలేరు అనిపిస్తుంది. మ్యూజిక్ ప్రిన్స్ హెన్రీ సూపర్బ్ గా ఇచ్చారు. మా లవ్ రెడ్డి మూవీని చూసి మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిణ్ శ్రావణి మాట్లాడుతూ - కిరణ్ గారి ప్రతి సినిమా టీజర్, ట్రైలర్ ఏది రిలీజైనా ఫస్ట్ చూసేది అంజన్ రామచంద్ర. తన ఫ్రెండ్ అంటే అంజన్ కు అంత అభిమానం. ఈరోజు మంచి స్థాయికి ఎదిగి తన ఫ్రెండ్ కోసం ఈ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న కిరణ్ అబ్బవరం గారికి థ్యాంక్స్. లవ్ రెడ్డి సినిమాలో నటించే అవకాశం అంజన్ వల్ల వచ్చింది. మేము ఈ రోజు ఈ స్టేజీ మీద నిలబడ్డాం అంటే అందుకు అంజన్ కారణం. నాకు ఇంతమంచి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ స్మరణ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ప్రేమలో గెల్చిన వాళ్లు, ఓడిన వాళ్లు, ప్రేమించిన వాళ్లను దగ్గరగా చూసిన వాళ్లు అందరూ చూడాల్సిన చిత్రం లవ్ రెడ్డి. మీరు థియేటర్ లోకి వెళ్లి కూర్చోండి చాలు మా మూవీనే మిమ్మల్ని చూపుతిప్పుకోకుండా చేస్తుంది. అన్నారు.

హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ - ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగడం కష్టం. చాలా డెడికేషన్  తో నా ఫ్రెండ్ కిరణ్ ఒక మంచి స్థాయికి చేరుకున్నాడు. అతని సక్సెస్ పట్ల సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో సకుటుంబంగా చూసే ప్రేమకథలు రావడం లేదు. అలాంటి ప్రేమ కథలు రాయడం తెరకెక్కించడం కూడా కష్టం. కానీ మా డైరెక్టర్ స్మరణ్ అందరికీ నచ్చే, అందరూ చూసే లవ్ స్టోరీని రాశాడు. నిజంగా మా స్మరణ్ గ్రేట్. లవ్ రెడ్డి సినిమాతో ఒక మంచి డైరెక్టర్, మంచి హీరో, మంచి హీరోయిన్ మీకు పరిచయం కాబోతున్నారు. మా సినిమా చూసి మైత్రీ మూవీ వాళ్లు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హోంబలే ఫిలింస్ కర్ణాటకలో రిలీజ్ చేస్తోంది. రీసెంట్ గా హిందూపూర్ లో షోస్ వేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి సినిమాను మీరంతా సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

అతిథిగా వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - నేనూ, అంజన్ షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చాం. ఆ ఎమోషనల్ బాండింగ్ మా మధ్య ఉంది. చాలా మంది ఇక్కడ కష్టాలు పడలేక, ఆర్థిక ఇబ్బందులతో తిరిగి వెళ్లిపోయారు. అంజన్ గట్టిగా నిలబడి ఉన్నందుకు అతనికి థ్యాంక్స్ చెబుతున్నా. మూడేళ్లుగా అంజన్ ఫ్యామిలీ అంతా లవ్ రెడ్డి సినిమా కోసం కష్టపడుతున్నారు. ఒక ఫ్యామిలీ కష్టపడి చేసిన సినిమా కాబట్టి మీరంతా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడండి. కంటెంట్ నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్ ఫుల్ గా సపోర్ట్  చేయండి. నా వల్ల అయిన హెల్ప్ నేను చేస్తా. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను. అంజన్ కు ఇండస్ట్రీ నుంచి తిరిగి వెళ్లిపోయే ఉద్దేశం లేదు. తను మంచి స్థాయికి చేరుకోవాలి. శ్రావణి తెలుగింటి అమ్మాయిలా ఉంది. ఆమె మాట్లాడిన స్పీచ్  కైనా సినిమాకు వెళ్లండి. నా క సినిమా  ఈనెల 31న రిలీజ్ అవుతోంది. లవ్ రెడ్డి 18న వస్తోంది. నా సినిమా రెండు రోజులు ఆగి చూసినా ఫర్వాలేదు. లవ్ రెడ్డి మాత్రం వెంటనే చూసేయండి. సినిమా మీద ఎంతో ప్రేమ ఉన్న ఇలాంటి టీమ్ సక్సెస్ కావాలి. లవ్ రెడ్డి సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తున్న మైత్రీ వారికి, ఆంధ్రలో రిలీజ్ చేస్తున్న వంశీ గారికి, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్న హోంబలే సంస్థకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :