ASBL Koncept Ambience
facebook whatsapp X

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే..

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే..

దుల్కర్‌ సల్మాన్‌ , మీనాక్షి చౌదరి కాంబోలో దీపావళి కానుకగా విడుదలైన చిత్రం లక్కీ భాస్కర్. తెలుగులో ఈ చిత్రం పెద్దగా ఆదరణ అందుకోనప్పటికీ మిగిలిన భాషల్లో కలెక్షన్స్ బాగా రాబట్టింది. దీంతో ఈ చిత్రం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీతో దుల్కర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సృష్టినం చేసుకోవడంతో పాటు మిడ్రేంజ్ హీరోలకు గట్టి పోటీగా నిలిచేలా కనిపిస్తున్నాడు. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి కూడా మంచి ఆక్యుఫెన్సీ తో కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన రెండు వారాలలోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ నమోదు చేసుకున్న ఈ చిత్రం.. నాలుగో వారం చేరేసరికి కలెక్షన్స్ పరంగా కాస్త వెనుకబడింది.

కొత్త సినిమాలో విడుదల కూడా దగ్గర ఉండడంతో ఇక ఈ చిత్రాన్ని ఓటీటీ లోకి తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫాన్సీ మొత్తానికి సొంతం చేస్తుంది. ఇక ఈ చిత్రం ఈనెల చివరికి అంటే నవంబర్ 30 న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది.

100 కోట్ల క్లబ్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ బ్యాంకు కథ చిత్రం 30 రోజుల పూర్తికాకముందే ఓటీటీ లోకి వస్తుంది అంటే మూవీ లవర్స్ కి పండగే. ఇక స్టోరీ విషయానికి వస్తే ఓ సాధారణ బ్యాంకు ఎంప్లాయి చుట్టూ ఇస్ మూవీకి సంబంధించిన కథ తిరుగుతుంది. 1980 ల నేపథ్యంలో జరిగిన ఓ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కష్టపడినా సరే ప్రమోషన్ దక్కని ఓ బ్యాంకు ఉద్యోగి కాస్త అడ్డదారులు తొక్కడంతో భారీగా డబ్బు రావడమే కాకుండా జీవితంలో కూడా ఎంతో ముందుకు వెళ్తాడు. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో పాటు సినిమాని ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించిన వెంకీ అట్లూరి ఈ మూవీతో మంచి సక్సెస్ సాధించారు. తెలుగులో మహానటి, సీతారామం లాంటి క్లాసిక్ హిట్స్ అందుకున్న దుల్కర్ కు లక్కీ భాస్కర్ హ్యాట్రిక్ సక్సెస్ ను అందించింది. ఈ మూవీ సక్సెస్ తర్వాత టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి దుల్కర్ ఫేవరెట్ ఛాయిస్ అయ్యే అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :