మైత్రికి షాకిచ్చిన తమిళ నిర్మాణ సంస్థ
టాలీవుడ్ కు సంక్రాంతి సీజన్ ఎంత కీలకమో కోలీవుడ్ లో కూడా పొంగల్ సీజన్ అంతే కీలకం. స్టార్ హీరోల సినిమాలు ఈ సీజన్ లో రిలీజ్ చేస్తే ఎంత యావరేజ్ టాక్ వచ్చినా సరే రికార్డులు సృష్టించిన దాఖలాలున్నాయి. అందుకే కుదిరినంత వరకు నిర్మాతలెవరైనా సరే ఈ ఛాన్సును వదులుకోవడానికి అంతగా ఇష్టడపరు.
మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) కూడా ఈ కారణంతోనే అజిత్(Ajith) తో చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly)ని జనవరి 10న రిలీజ్ చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను ఎంతో వేగంగా స్టార్ట్ చేశారు. అజిత్(Ajith) కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాగా దీనిపై అందరికీ ఎన్నో అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సడెన్ గా అజిత్ నటిస్తున్న మరో సినిమా విదాముయార్చి(Vidamuyarchi)ని కూడా లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) పొంగల్కే రిలీజ్ చేస్తున్నట్లు చెప్పి మైత్రీ సంస్థకు షాకిచ్చింది.
వాస్తవానికి విదాముయార్చి ఎప్పుడో రిలీజవాల్సింది. ఇండియన్2(Indian2) రిజల్ట్ వల్ల ఓసారి, షూటింగ్ లో అజిత్ కు గాయాలవడం వల్ల ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు చివరకు సడెన్ గా పొంగల్ కు రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. ప్రస్తుతానికి తమిళం నుంచి పొంగల్ కు విక్రమ్(Vikram) వీరధీర శూరన్(Veeradheera Sooran) తప్ప మరో సినిమా లేదు. దానికి విదాముయార్చి తోడైంది. గేమ్ ఛేంజర్(Game Changer) రిలీజవుతున్నప్పటికీ తెలుగు సినిమాలకు కోలీవుడ్ లో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. మరి లైకా ఇచ్చిన షాక్ కు మైత్రీ సంస్థ తమ సినిమాను వాయిదా వేస్తుందా లేక తమ సినిమాను కూడా రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.