సేతుపతి సినిమా అంత కలెక్ట్ చేస్తుందా?
విజయ్ సేతుపతి(Vijay sethupathi) ప్రధాన పాత్రలో నటించిన మహారాజా(maharaja) సినిమా ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిథిలన్ స్వామినాథన్(nithilan Swamynathan) దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై భారీ వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డు స్థాయి వ్యూస్ తో అదరగొట్టింది.
అలాంటి మహారాజా సినిమా ఇప్పుడు చైనాలో రిలీజ్ కు రెడీ అవుతుంది. నవంబర్ 29న చైనాలో మహారాజా గ్రాండ్ స్కేల్ లో రిలీజవుతోంది. ఏకంగా 40 వేల స్క్రీన్లలో మహారాజాను రిలీజ్ చేయడానికి యిషి ఫిల్మ్స్(Ishi films), అలీ బాబా పిక్చర్స్(ali baba pictures) అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
చైనాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు వేయగా దానికి లక్షా 30 వేల డాలర్లు వసూలు చేసింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా కచ్ఛితంగా చైనా మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుందని, మహారాజా సినిమా చైనాలో కూడా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు చైనాలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా దంగల్(Dangal) ఉంది. ఇప్పుడు మహారాజా 40వేల స్క్రీన్స్ లో భారీగా రిలీజవుతున్న నేపథ్యంలో ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.