ASBL Koncept Ambience
facebook whatsapp X

మహాయుతి ప్రభంజనం.. ఎంవీఎకు భారీ షాక్..

మహాయుతి ప్రభంజనం.. ఎంవీఎకు భారీ షాక్..

మహారాష్ట్రలో మహాయుతి గ్రాండ్ విక్టరీ సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ మహాయుతి మరోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ అత్యధిక స్థానాల్లో విజయభేరీ మోగించింది.

పథకాలు కీలక పాత్ర

2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి(ఎన్డీఏ) ఘోర పరాజయం చవిచూసింది. అయితే, ఆ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న మహాయుతి, అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. దీంతో ఎన్నికల ముంగిట సీనియర్ సిటిజెన్లు, విద్యార్థులు, మహిళలు- అన్ని వర్గాల వారిని ఉద్దేశించి పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. ఈ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రభుత్వం మారితే పథకాలు రద్దవుతాయని ప్రచారం చేసింది. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా- పథకాల వల్ల ప్రయోజనాలు అందుకున్న ప్రజలు మహాయుతి వైపు మొగ్గుచూపారు.

స్థానిక సమస్యలకు ప్రాధాన్యం

స్థానిక సమస్యలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది మహాయుతి కూటమి. క్షేత్ర స్థాయిలో క్యాడర్ను బలోపేతం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా, డబుల్ ఇంజిన్ సర్కార్, అయోధ్య రామ్ మందిరం వంటి జాతీయ విషయాలకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇచ్చింది. మహారాష్ట్రలో ప్రజలు స్థానిక సమస్యలకు ఎక్కువ ప్రధాన్యం ఇస్తారని తెలుసుకున్న వ్యూహకర్తలు ఆ మేరకు ప్రణాళికలు అమలు చేశారు.

ముగ్గురు సీఎం అభ్యర్థులు

మహాయుతిలో ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, ఇమేజ్ బిల్డింగ్పై దృష్టి సారించారు. ఇక పరిస్థితికి తగ్గట్టు త్వరగా నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ నిష్ణాతులు. మరోవైపు, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వీరి ముగ్గురి అనుభవం మహాయుతి విజయంపై కీలక ప్రభావం చూపింది. ఇదే సమయంలో సిద్ధాంతాల పరంగా భిన్న దృవాలైన మహా వికాస్ అఘాడీ మిత్రపక్షాలు- అంతర్గత విభేదాలతో అధికార పక్షాన్ని అనుకున్నంత మేర అడ్డుకోలేకపోయాయి.

ప్రాంతానికో ప్రణాళిక

లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ వ్యూహం మార్చుకుంది. స్థానిక సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రాంతాల వారిగా పరిస్థితులను బట్టి వ్యూహాలు, ప్రణాళికల్లో మార్పులు చేసింది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న చంద్రపుర్ జిల్లాలోని చిమూర్లో ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఆదివాసీలు, దళితులు, ఓపీసీలపై ఉదారంగా వ్యవహరించడం వల్లనే ఆ వర్గాలు వెనుకబడ్డాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సోయాబీన్, పత్తి అధికంగా పండే విదర్భా ప్రాంతంలో సోయాబీన్ రైతులుకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇలా ఎక్కడ సమస్యలను అక్కడే లేవనెత్తి, వాటికి పరిష్కారం తాము చూపుతామని ప్రచారం చేశారు. చివరకు సఫలమయ్యారు. మరోమారు అధికారం కైవసం చేసుకున్నారు.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :