మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ మహా యుద్ధం.. గెలుపు ఎవరిదో?
నవంబర్ 20, బుధవారం నాడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అవుతుంది. అంటే ప్రస్తుతం ఇక ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కమలనాధులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం సాగిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ కూడా తగ్గేదే లేదు అన్నట్టు జోరుగా ముందుకు దూసుకుపోతోంది. మహారాష్ట్రలో మొత్తం 6 రీజియన్లు, 36 జిల్లాలతో పాటు 2008 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ఒకే విడతలో పోలింగ్ జరగడం ఆ ప్రాంతాన్ని హాట్ టాపిక్ గా మార్చింది.
నిజానికి మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. అయినా సరే ఏమాత్రం జంకకుండా ఎన్నికల సంఘం ఒకే విడతలో భారీ ఎత్తున ఎన్నికలను నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక పార్టీ విషయాలకు వస్తే ఈసారి భారీ స్థాయిలో పోరుకు సిద్ధం అన్నట్లు సాగుతోంది వ్యవహారం. తమ హవా కొనసాగించడానికి అధికార బీజేపీ ప్రయత్నిస్తుంటే.. ఆదిపత్యాన్ని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఎదురైన పరాభవం నుంచి బయటకు రావాలి అంటే ఇక్కడ గెలుపు కాంగ్రెస్కు చాలా అవసరం.
ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఏడు గ్యారంటీలను ప్రకటించింది. ఎప్పటినుంచో ఉచితలకు తాము వ్యతిరేకులం అని చెప్పుకుంటూ వచ్చిన కమలనాధులు కూడా కాంగ్రెస్ దాటి తట్టుకోవడానికి ఎన్నో ఉచిత హామీలను అందించారు. ఇక ప్రచారానికి పొరుగు రాష్ట్రాల నాయకులను రెండు పార్టీలు భారీ ఎత్తున దింపుతున్నాయి. ఎప్పటినుంచో ఎన్నికల ప్రచారానికి చాలావరకు దూరంగా వస్తున్న సోనియా గాంధీ కూడా ఈసారి ఈ ఎన్నికల ప్రచార పగ్గాలు తన చేతిలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ప్రజల నాడి ఏ పార్టీ వైపు ఉందో ఫలితాలు వస్తే కానీ తెలియదు. మొత్తానికి ఈసారి మహారాష్ట్రలో జరగబోయే ఈ ఎన్నికల్లో గెలుపు అనేది అంత ఈజీ కాదు అన్న విషయం రెండు పార్టీలకు బాగానే అర్ధమైనట్లు కనిపిస్తోంది.