'మహా యుతి' కూటమిని భయపెడుతున్న విబేధాలు...
మహా రాష్ట్రలోని అధికార యుతి కూటమిని ఓటమి భయం పీడిస్తోందా..? కలసి ఉంటేనే గెలుస్తాం లేదంటే ఓడిపోయే ప్రమాదముందని బీజేపీ అగ్రనేతలు బహిరంగవేదికలపైనే ఎందుకు చెప్పేస్తున్నారు. అంటే విపక్ష కూటమి క్రమంగా బలం పుంజుకుంటోందా..? ముఖ్యంగా కూటమిలోని పార్టీల మధ్య పొత్తుపొరపొచ్చాలున్నాయా..? అసలు మరాఠా ప్రభుత్వంలో ఏం జరుగుతోంది. సీఎం కుర్చీ విషయంలో విబేధాలు ఏర్పడ్డాయా...? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార మహాయుతి ప్రభుత్వంలో విభేదాలు భయపడుతున్నాయి.
ఇటీవల హర్యానా ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే పడిపోతాం) అనే నినాదం చేశారు.ఈ నినాదాన్ని మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహాయుతి కూటమి అన్వయించడాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఘండ్, ఇతర రాష్ట్రాల్లో ఈ నినాదం పనిచేస్తుందేమో కానీ..మహారాష్ట్రలో పనిచేయదని వ్యాఖ్యానించారు.
అజిత్ పవార్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నినాదాన్ని అజిత్ పవార్ అర్ధం చేసుకోవాలని సూచించారు. అజిత్ పవార్ దశాబ్దాలుగా లౌకిక, హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతోనే ఉన్నారు. సెక్యులరిస్టులుగా చెప్పుకునే వారిలో నిజమైన సెక్యులరిజం లేదు. హిందుత్వను వ్యతిరేకించడమే లౌకికవాదమని భావించే వ్యక్తులతో ఆయన కొనసాగుతూ వచ్చారు. ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి నాయనకు కొంత సమయం పడుతుంది’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. గతంలో మాతో కలిసున్నవారు (ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్దేశించి) దీనిని అర్ధం చేసుకోలేరని విమర్శించారు.
‘ఈ వ్యక్తులు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేరు లేదా ఈ నినాదం అర్థం చేసుకోలేరు అని మండిపడ్డారు. మరోవైపు మహా నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో.. మోడీ ఈ నినాదాన్ని ‘ఏక్ హై తో సేఫ్ హై’గా మార్చారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో గురువారం నాటి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చశనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.