మహారాష్ట్రలో మహాయుతి విజయం
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 221 సీట్లు దక్కించుకుంది. ఇంకా 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. విపక్ష కూటమి ఎంవీఏ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పటివరకు 45 స్థానాల్లో విజయం సాధించగా.. 10 చోట్ల ఆధిక్యంలో ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి సర్కారు పట్టు నిలుపుకొంది. 2019 నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు, నలుగురు డిప్యూటీ సీఎంలను చూసిన ఈ రాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఓబీసీ ఓట్ల సమీకరణ, ఆకర్షణీయమైన పథకాలు, మహిళల ఓట్లు విజయంలో కీలక భూమిక పోషించాయి. బీజేపీ, శివసేన శిందే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. ఇలా మూడు పార్టీలు మెరుగైన ప్రదర్శన చేయడం కూటమి విజయానికి దోహదం చేశాయి.
Tags :