ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ సినిమాలో మ‌హేష్ క్యామియో

ఆ సినిమాలో మ‌హేష్ క్యామియో

గుంటూరు కారం(Gunturu Karam) సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు(Mahesh Babu) నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో సినిమా వ‌చ్చింది లేదు. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ మ‌హేష్ ను ఎప్పుడెప్పుడు వెండితెర‌పై చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. వారి ఆనందానికి త‌గ్గట్టే త్వ‌ర‌లోనే మ‌హేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ రాబోతుంది. గ‌ల్లా అశోక్(Galla Ashok) హీరోగా గుణ369(Guna369) ఫేమ్ అర్జున్ జంధ్యాల(Arjun Jandhyala) ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌కీనంద‌న వాసుదేవ(Devaki Nandana Vasudeva) సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

ఆ సినిమాలో మ‌హేష్ కాసేపు క‌నిపించే క్యామియో చేశాడ‌ని లీక్ ప్ర‌స్తుతం నెట్టింట వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ఎక్క‌డా చెప్ప‌లేదు కానీ సోర్స్ మాత్రం న‌మ్మే విధంగానే ఉంది. రెండు నెల‌ల కింద‌టే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారంటున్నారు. ఇదే నిజ‌మైతే ఈ సినిమాపై బ‌జ్ ఒక్క‌సారిగా పెర‌గ‌డం ఖాయం.

హీరో(Hero movie) సినిమాతో లాంచ్ అయిన గ‌ల్లా అశోక్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని ప్ర‌శాంత్ వ‌ర్మ(Prasanth Varma) ఇచ్చిన క‌థ‌తో ఆడియ‌న్స్ ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన‌ ప్ర‌మోష‌న్స్ ఇంకా మొద‌లుపెట్ట‌లేదు. హ‌నుమాన్(Hanu man) పుణ్యమా అని క‌థ ఇచ్చిన ప్ర‌శాంత్ వ‌ర్మ పేరును బాగానే వాడుకుంటుంది చిత్ర యూనిట్. ఈ సినిమా క‌థ‌, క‌థ నేప‌థ్యం ఏంట‌నేది ఇంకా తెలియ‌దు. టీజ‌ర్ లో కొన్ని హింట్స్ ఇచ్చారు త‌ప్ప క్లారిటీగా చెప్ప‌లేదు. ట్రైల‌ర్ వ‌స్తే క‌థేంట‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ ఈ మూవీలో న‌టిస్తున్నాడ‌నే వార్త తెలియ‌గానే సినిమాపై ఎక్క‌డలేని ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముంద‌నేది తెలియాల్సి ఉంది. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :