ASBL Koncept Ambience
facebook whatsapp X

కొత్త పీసీసీ సారథి ముందు సవాళ్లు..

కొత్త పీసీసీ సారథి ముందు సవాళ్లు..

తెలంగాణ కొత్త పీసీసీ సారథిగా ఎన్నికైన ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ కు .. పలు సవాళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రస్తుతం కష్టాలైతే లేవు కానీ సవాళ్లు మాత్రం ఎదుర్కొనక తప్పనిపరిస్థితి. ఎందుకంటే.. పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి... పార్టీ ని కష్టాల నుంచి గట్టెక్కించి, పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం పార్టీ క్లిష్టపరిస్థితుల్లో అయితే లేదు. కానీ బలంగా కూడా లేదు. ఎందుకంటే.. చాలా ప్రాంతాల్లో హస్తాన్ని బలోపేతం చేయాల్సిన పరిస్థితులున్నాయి.

ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కేడర్.. బలహీనంగా ఉంది.దాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత కొత్త సారథి మహేష్ గౌడ్ పై ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా టీపీసీసీ చీఫ్‌ కావడం మామూలు విషయంకాదు. ఈ అవకాశం మహేశ్‌కుమార్‌గౌడ్‌కు దక్కింది. అయితే, అదే ఇప్పుడు ముళ్ల కిరీటం కూడా. పవేళ్లు అధికారం లేకపోవడంతో క్యాడర్‌ చాలా బలహీనపడింది. చాలా మంది పార్టీని వీడారు. అధికారంలోకి రావడంతో మళ్లీ రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే పదేళ్లు పార్టీ కోసం కష్టపడినవారిని, పార్టీని వీడి మళ్లీ చేరినవారిని సమన్వయం చేయడం ఇప్పుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ముందు ఉన్న సమస్య. పార్టీ పదవుల నియామకంలోనూ అందరినీ సంతృప్తి పర్చాల్సి ఉంటుంది.

నామినేటెడ్‌ పదవుల్లోనూ కొత్త, పాతవారి మధ్య సయోధ్య కుదర్చాలి. ఇది పీసీసీ కొత్త సారథికి కత్తిమీద సామే. హెచ్‌ఎంసీలో పార్టీ బలోపేతం.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పార్టీని బలోపేతం చేయడం మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అతిపెద్ద సవాల్‌. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌ గెలవలేదు. ఇక 2009 తర్వాత గ్రేటర్‌ పరిధిలో కాంగ్రెస్‌ బాగా బలహీనపడింది.ప్రస్తుతం అధికార పార్టీగా వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. ఆమేరకు పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత సారథిపై ఉంది. ఇక త్వరలో జరిగే పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ సత్తాను చాటాలి. మున్సిపాలిటీ, కార్పొరేషన్లనూ కైవసం చేసుకోవాలి.

ఇది పీసీసీ చీఫ్‌కు అంత ఈజీ కాదు. వీటిని అధిగమించి.. పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. గౌడ సామాజిక వర్గానికి తొలిసారి కాంగ్రెస్ అందలం ఎక్కించింది. తొలిసారి ఈ సామాజికవర్గం నేత పీసీసీ సారథిగా ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించడంతో టీ కాంగ్రెస్‌లో కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పటి వరకు పలు సామాజికవర్గాల నేతలు టీపీసీసీ పదవి చేపట్టారు. వారి వారి స్థాయుల్లో పార్టీని ముందుకు నడిపించారు కూడా. ఇప్పుడు మహేశ్ కుమార్ గౌడ్ ..పార్టీని ఎలా నడిపిస్తారో అన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :