అమెరికాలో బట్టబయలు.. వెంటనే అతన్ని అరెస్టు చేయాలి
అదానీ కుంభకోణాన్ని అమెరికా అధికారులు బట్టబయలు చేశారని, వెంటనే అతని అరెస్టు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని కోరారు. అదానీ దాదాపు రూ.2వేల కోట్ల మేర లంచాలు పంచారు. ఆయన అవినీతిపై రాహుల్‌గాంధీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ స్పందించలేదు. అర్హత లేకపోయినా అదానీకి రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చారు. ప్రధాని మోదీ అండతో అనేక విమానాశ్రయ కంట్రాక్టులు చేజిక్కించుకుని అవినీతి సామ్రాజ్యం స్థాపించారు. 2014 తర్వాత అదానీ సంపద ఎలా పెరిగిందో చూశాం. రూ.100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సీఎంలను జైల్లో వేశారు. రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీపై చర్యలేవి? అని ప్రశ్నించారు.