ASBL Koncept Ambience
facebook whatsapp X

మలేసియాలో అంబరాన్ని ఆంటిన మైటా దశాబ్ది ఉత్సవాలు

మలేసియాలో అంబరాన్ని ఆంటిన మైటా దశాబ్ది ఉత్సవాలు

మలేషియాలో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలకు ఎలాంటి కష్టం రాకుండా, అందరికీ తోడ్పాటుగా నిలుస్తూ,  తెలంగాణ కట్టు బొట్లని  కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న ప్రస్థానం మలేషియా తెలంగాణ అసోసియేషన్ ది. 2014 లో తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత  మలేషియాలో స్థిరపడ్డ తెలంగాణ వాసులందరూ కలిసి వాళ్ళందరి బాగోగుల కోసం ఒకరికోసం ఒకరు మేమున్నామంటూ స్థాపించబడ్డ సంస్థ ఈ మలేషియా తెలంగాణ అసోసియేషన్.

తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ కట్టు బోట్లని మరిచిపోకుండా అందరూ ఏకతాటిగా ఉంటూ ఆపన్నులకు అండగా మనమంతా ఒకటే అన్నట్లుగా మలేషియాలో ఒక మహాశక్తిగా వెలిగింది ఈ మలేషియా తెలంగాణ అసోసియేషన్.  2014లో స్థాపించబడ్డ మైటా దశాబ్ది కాలంలో తెలంగాణ పండగలను, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బతుకమ్మ, బోనాలను సాంప్రదాయబద్ధంగా కొనసాగిస్తూనే వుంది. నవంబర్ 9న, దశాబ్ది వేడుకని మలేషియాలోని మా ట్రేడ్ కన్వెన్షన్ సెంటర్లో భారీగా నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు,  తెలుగు సినీ కళాకారులు, నటి నటులు, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీత ధరావత్ రాజకుమార్ మరియు బృందం (పేరిణి నృత్యం), ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీత అంగడి భాస్కర్ మరియు బృందం(డప్పు), రేలారే గంగా, జంగిరెడ్డీ, దరువు అంజన్న లతో పాటు పలు తెలంగాణ జానపద గాయనీ గాయకులు పాల్గొన్నారు. జబర్దస్త్ సినీ కళాకారులు పాల్గొని తమ హాస్యంతో సభను ఉర్రూతలూగించారు.

 గత రెండు మూడు నెలలుగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ సభ్యులు ఈ వేడుక కోసం ఆటల పాటల పోటీలతో పాటు వకృత పోటీలో క్రికెట్ మ్యాచ్ లో ఇలా పలు రకాలుగా పోటీలు నిర్వహించి చిన్నారులకు మరింత ఉత్సాహాన్ని నింపారు.

ఈ నవంబర్ 9న జరిగిన మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. వేలాది కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ సంబరాల్లో ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్లుగా సందర్శించిన తీరు చూపరులను మరింత ఆకట్టుకుంది భారీ కాకతీయ తోరణం తెలంగాణ తల్లి విగ్రహము,  బతుకమ్మ బోనాల ప్రతిమలు, సమ్మక్క సారక్కల గద్దెలు, యాదాద్రి మందిరం నుండి భద్రకాళి మందిరం వరకు వేయి స్తంభాల గుడి, చార్మినార్, మక్కా మసీద్, మెదక్ చర్చి,  ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని పలు హిస్టారికల్ ప్రదేశాలన్నీ సెట్టింగులుగా వేసి భారీ వేడుకను నిర్వహించారు.

ఇలా అంబరాన్ని అంటిన సంబరాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న త్రిపుర చీఫ్ జస్టిస్ టి. అమర్ నాథ్ గౌడ్ గారు, ఇండియన్ హై కమీషనర్ బి.ఎన్. రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు గారు,  పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు, ప్రస్తుత శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ గారు,  ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ మొలుగారం గారు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య గారు, ఆకునూరి మురళి(రిటైర్డ్ ఐఏఎస్) గారు, మరియు ఇతర ప్రముఖులందరూ పాల్గొని మలేషియా అసోసియేషన్ సభ్యులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు.

మలేషియా ప్రధాన మంత్రి కార్యాలయ అధికారుల చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా స్వతహాగా బిజినెస్ రంగంలో ఎదిగి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన పలువురిని అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఏర్పాటు నుండి ఈ పది సంవత్సరాల కాలంలో సేవలను అందించిన మాజీ కమిటీ సభ్యులను సత్కరించారు.

ఇంతే కాకుండా ఎప్పుడూ ఆఫీసు పనుల్లో బిసినెస్లో బిజీ బిజీగా ఉండే మలేషియా తెలంగాణ బిడ్డలందరూ తమ తమ కుటుంబ సభ్యుల తో కలిసి ఈ వేడుకను పంచుకున్నారు. ముఖ్యంగా *బలగం* చిత్ర కథానాయకి కావ్య కళ్యాణ్ రామ్ సృత్యాలు చూపరులను  ఆకట్టుకున్నాయి. ప్రముఖ సినీ తార స్నేహ గుప్త తో కలిసి ఆట సందీప్ వేసిన డాన్స్ స్టెప్పులతో ప్రాంగణమంతా మారుమ్రోగిపోయింది. ఆటవిడుపుగా జబర్దస్త్ కళాకారులు అందించిన కామెడీ స్కిట్లతో కడుపుబ్బ నవ్వుకున్నారు.

వృత్తిరీత్యా మలేషియా లో స్థిరపడ్డ కూడా తెలంగాణ కట్టు బొట్లని  మరిచిపోకుండా తెలంగాణ మహిళలు చేసిన సాంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రదర్శనలు, లంబాడీ నృత్యాలు కూడా అందరినీ మెప్పించాయి.

ఈ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐటీ శాఖా మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను  కొనియాడారు. ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ 4 నెలల క్రితం తను అనౌన్స్ చేసిన కమిటీ ఆధ్వర్యంలో ఈ దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించడం సంతషంగా ఉందని మరియు భవిష్యత్తులో కూడా తమవంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. శాసనసభ్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితం స్థాపించబడ్డ ఈ సంస్థను నిర్విరామంగా కొనసాగిస్తున్న సభ్యులందరినీ అభినందించారు. వీరితో  పాటు మలేషియాలోని రాజకీయ ప్రముఖులు మరియు పారిశ్రామిక వేత్తలు కూడా సంస్థ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడం లో సహాయపడతామని  సూచించారు.

మరుసటి రోజు మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారి బృందం, మలేషియా మంత్రులు మరియి స్థానిక పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన బిజినెస్ మీట్ లో తెలంగాణా లో ఉన్న అవకాశాలను వినియోగించొకొని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు , మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్  , జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రేజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రేజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్, శ్రీహరి, జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, మిథున్ శృతి, రాధిక, పూర్ణ లత, నరేందర్ రెడ్డి, అనిల్ రావు, వెంకట్,  వినోద్, హరీష్, శశి గీత మరియు ఇతరులు ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :