ఈసారి మాత్రమే కాదు.. మరో పదేళ్లపాటు సీఎంగా రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి మాత్రమే కాదు, మరో పదేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన తీరు అతని రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. మహేశ్వర్ రెడ్డికి బీజేపీలో పని ఏమీ లేక పగటలి కలలు కంటూ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీలో రోజురోజుకూ ముదిరిపోతున్న విభేదాలు, వర్గపోరు నుంచి అందరి దృష్టిని మరల్చేందుకు ఇలాంటి జాతకాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
Tags :