ASBL Koncept Ambience
facebook whatsapp X

మీ దీదీగా వచ్చా.. సీఎం పదవి ముఖ్యం కాదు..

మీ దీదీగా వచ్చా.. సీఎం పదవి ముఖ్యం కాదు..

బెంగాల్ హత్యాచార ఘటన తదనంతరం కొనసాగుతున్న నిరసనలు చల్లార్చేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు విరమించాలని మమత కోరినా.. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ ఆందోళనలు వీడమని మెడికోలు స్పష్టం చేశారు. అయితే.. చివరి ప్రయత్నాన్ని సైతం చేశారు మమత. వైద్యుల నిరసన శిబిరం వద్దకు వచ్చిన మమత.. వారికి ఓ విన్నపం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది వద్దని చెప్పినా మీవద్దకు వచ్చా.. మీరు నిరసనలు ఆపండి.తిరిగి విధుల్లో చేరండని సూచించారు.

ఈ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం స్వస్థ్ భవన్ ఎదుట కొన్నిరోజులుగా వైద్యులు నిరసనలు చేస్తున్నారు. నిరసన శిిబిరానికి వెళ్లిన సీఎం మమతను చూసిన వైద్యులు న్యాయం కావాలంటూ నినదించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నమన్నారు. గతంలో తాను విద్యార్థి నాయకురాలిగా పనిచేశానన్నారు మమత.ఆందోళనలు చేయడం మీ హక్కన్న మమత.. సమస్య పరిష్కారం కోసం కొన్నిరోజులుగా మీతో చర్చలకోసం ఎదురుచూస్తున్నామన్నారు. నేనిక్కడికి సీఎంగా రాలేదు. మీ దీదీగావచ్చా.. సీఎం పదవి ముఖ్యం కాదు.

కానీ ప్రభుత్వాన్ని తానొక్కరే నిర్వహించడం లేదని గుర్తు చేశారు మమత.బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నదే తన అభిమతమన్నారు మమత. కొన్నిరోజులుగా రోడ్లపై మెడికోలు ఆందోళనలు చేస్తుంటే... తాను నిద్రలేని రాత్రిళ్లు గడిపానన్నారు మమత. మీడిమాండ్లను కచ్చితంగా అధ్యయనం చేస్తాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. ఆర్జికర్ ఆస్పత్రిలో రోగుల సంరక్షణ కమిటీ రద్దు చేస్తున్నాం.దర్యాప్తును మరింత వేగంగా పూర్తి చేయాలని సీబీఐని కోరుతున్నాం. మామీద విశ్వాసం ఉంటే విధుల్లో చేరండి. మీపై చర్యలు తీసుకోబోమన్నారు మమత. అయితే..తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకూ రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పడంతో మమత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :