ASBL Koncept Ambience
facebook whatsapp X

వారం రోజుల్లో కేసును పరిష్కరించలేకపోతే.. సీబీఐకి అప్పగిస్తాం : మమత

వారం రోజుల్లో కేసును పరిష్కరించలేకపోతే.. సీబీఐకి అప్పగిస్తాం : మమత

జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. వారం రోజుల్లో కేసును పరిష్కరించలేకపోతే సీబీఐకి అప్పగిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న వేళ పోలీసులకు దీదీ ఈ డెడ్‌లైన్‌ విధించారు. సీఎం మమతా బెనర్జీ మృతురాలి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో మరింతమంది నిందితులు ఉన్నట్లయితే వారందరినీ ఆదివారం లోగా అరెస్టు చేస్తాం. ఒకవేళ అప్పటిలోగా రాష్ట్ర పోలీసులు కేసును పరిష్కరించకలేకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తాం. ఈ కేసుపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని దీదీ వెల్లడిరచారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :