ASBL Koncept Ambience
facebook whatsapp X

ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న "ఆదిపర్వం"

ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న "ఆదిపర్వం"

రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం "ఆదిపర్వం" ( Aadiparvam). ఈ  సినిమాలో మంచు లక్ష్మి ( Manchu Laxmi ) ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం (Aditya Om)పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా "ఆదిపర్వం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. "ఆదిపర్వం" సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో "ఆదిపర్వం" సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.

1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా "ఆదిపర్వం" సినిమాను రూపొందించారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, టెక్నికల్ హంగులతో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి వస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :