Manchu Manoj: పోలీస్ స్టేషన్‌కి మంచు మనోజ్...పిర్యాదు లో ఏముంది అంటే.....
మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మంచు మనోజ్‌పై(Manchu Manoj) మోహన్ బాబుకి సంబంధించిన వారు దాడి చేశారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మనోజ్ సైతం సన్నిహితుల సాయంతో హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స పొందారు. 100 కి కాల్ చేసి తన తండ్రి తనపై దాడి చేయించారని మనోజ్ ఫిర్యాదు చేశారని కూడా న్యూస్ వచ్చింది. ఇక నేడు ఫహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మనోజ్ ట్విస్ట్ ఇస్తూ తనపై 10 మంది గుర్తు తెలియని అగంతకులు దాడి చేశారు అంటూ ఫిర్యాదు చేశారు.మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. గత రెండు రోజులుగా ఈ విషయమై మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. మోహన్ బాబుతో చర్చలు జరుపుతున్న సమయంలోనే మంచు మనోజ్‌పై దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ దాడి నేపథ్యంలో 100కి కాల్ చేసి మనోజ్ ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏ ఒక్కరూ అధికారికంగా నోరు విప్పలేదు. దాంతో మరింత పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి.
మోహన్ బాబుపై ఫిర్యాదు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ మనోజ్ ఉన్నారంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.నేడు ఫహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కి మంచు మనోజ్ సన్నిహితులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలోనూ మోహన్ బాబుపై ఫిర్యాదు చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ మంచు మనోజ్ ట్విస్ట్ ఇస్తూ తనపై గుర్తు తెలియని అగంతకులు దాడికి పాల్పడ్డారు అంటూ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్, కిరణ్ సీసీ టీవీ ఫుటేజ్‌ని తీసుకు వెళ్లారని సైతం ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారట. ఈ విషయాలను సీఐ మీడియాకు వివరించారు. అయితే ఫిర్యాదులో తనపై మోహన్ బాబు కానీ, ఆయన ప్రేరేపించిన వారు కానీ దాడి చేశారని మనోజ్ పేర్కొనలేదు.
దాంతో తండ్రిపై మనోజ్ ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేయనున్నట్లుగా పేర్కొన్నారు.ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాదాపూర్‌లో మధ్యవర్తి సమక్షంలో మోహన్ బాబు, మంచు మనోజ్‌లు భేటీ కాబోతున్నారని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు సైతం మాదాపూర్‌లో జరగబోతున్న మీటింగ్‌కి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. కానీ మంచు విష్ణు టీమ్ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. విష్ణు అమెరికాలో ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. ఇక వివాదం విషయానికొస్తే మోహన్ బాబు యూనివర్శిటీ, ఇతర విద్యా సంస్థలు, కొన్ని వ్యాపార సంస్థల హక్కుల కోసం మంచు మనోజ్ పోరాడుతున్నాడని తెలుస్తోంది.
అంతకు ముందు మోహన్‌బాబు నివాసం అయిన జల్లపల్లి వద్దకు పోటా పోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. మంచు మనోజ్, విష్ణు అక్కడ చర్చలు జరపాలి అనుకున్నారట. అక్కడ చర్చల కోసం వెళ్లిన సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో విష్ణు ఏకంగా 40 మంది బౌన్సర్లను, మంచు మనోజ్ 30 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే వివాదం పెద్దది కాకూడదు అనే ఉద్దేశ్యంతో గొడవలు జరగకూడదు అనే ఉద్దేశ్యంతో మంచు వారి పంచాయతీ జల్లపల్లి వద్ద కాకుండా మాదాపూర్‌లో నిర్వహించేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది.