ASBL Koncept Ambience
facebook whatsapp X

Sajjala: సజ్జలకు నోటీసులు..! వైసీపీ సైలెంట్ వెనుక రీజనేంటి..?

Sajjala: సజ్జలకు నోటీసులు..! వైసీపీ సైలెంట్ వెనుక రీజనేంటి..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా నాడు వేధించిన వైసీపీ (YSRCP) నేతలు, పోలీసులపై  (Police) చర్యలు తీసుకోవట్లేదంటూ ఒకవైపు కూటమి నేతలు, కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి మాటలు తెలుగు తమ్ముళ్లకు (TDP Leaders) ఓదార్పునివ్వట్లేదు. ఇప్పుడు టీడీపీ ఆఫీసుపై దాడి (TDP Office attack) కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) పోలీసులు నోటీసులు (Notices) ఇవ్వడం మాత్రం టీడీపీలో జోష్ నింపుతోంది. అదే సమయంలో వైసీపీ (YCP) మాత్రం దీనిపై స్పందించేందుకు సాహసించట్లేదు.

వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశంపార్టీ ఆఫీసుపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక జోగి రమేశ్ (Jogi Ramesh), దేవినేని అవినాశ్ (Devineni Avinash), నందిగం సురేశ్ (Nandigam Suresh), లేళ్ల అప్పిరెడ్డి (Lella Appireddy) తదితరులు ఉన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే వీళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నడిపించింది వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డే (Sajjala) అని పోలీసులు భావిస్తున్నారు. ఆ రోజు దాడిలో పాల్గొన్న వారందరికీ తాడేపల్లి నుంచి సజ్జల డైరక్షన్ ఇచ్చారని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన్ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. తాజాగా సజ్జల రామకృష్ణా రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గురువారం విచారణకు రావాలని ఆదేశించారు.

వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డికి కొంతకాలం కిందటే ఈ కేసులో లుకౌట్ నోటీసులు (lookout notices) జారీ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ ఎయిర్ పోర్టు (Delhi Airport) చేరుకున్న సజ్జల రామకృష్ణా రెడ్డిని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. గుంటూరు (Guntur) పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ముందుస్తు బెయిల్ (bail) పొంది ఉన్నారని.. ఆయన్ను వదిలేయాలని గుంటూరు పోలీసులు చెప్పడంతో సజ్జలను వడిచిపెట్టారు. సజ్జలకు లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు డీజీపీ (DGP) కూడా చెప్పారు. సజ్జలను ఎయిర్ పోర్టులో అడ్డుకోవడం, లుకౌట్ నోటీసులపై డీజీపీ క్లారిటీ ఇవ్వడం వైసీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతలోనే సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు నోటీసు ఇవ్వడం ఆ పార్టీని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి కీలక పాత్ర పోషించారో అందరికీ తెలుసు. జగన్ తర్వాత అన్నీ ఆయనే. అలాంటి నేతపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం.., తాజాగా విచారణకు రావాలని ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. అయినా వైసీపీ నేతలు (YCP Leaders) మాత్రం సజ్జలకు ఇంత జరుగుతున్నా నోరు మెదిపేందుకు ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. వైసీపీ అనుకూల మీడియా కూడా ఈ అంశంపై పెద్దగా పట్టించుకోవట్లేదు. వాస్తవానికి సజ్జల అన్ని శిక్షలకు అర్హుడే అనే టాక్ వైసీపీలోని ఓ వర్గంలో ఉంది. సజ్జల వల్లే పార్టీ ఓడిపోయిందని పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే బహిరంగంగగా చెప్పారు కూడా. అందుకే సజ్జలకు నోటీసులు ఇచ్చినా దానిపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :