ATPS చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న మన్నవ మోహన్ కృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీస్ సర్వీసెస్ చైర్మన్‌గా మన్నవ మోహన్ కృష్ణ గుంటూరులో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మన్నవ సమర్థతను సీఎం చంద్రబాబు గుర్తించి.. కీలక పదవి అప్పగించారని తెలిపారు. మన్నవ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన చెప్పారు. గత పదేళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి ఆయన అందించిన సేవలను ఈ సందర్బంగా ప్రశంసించారు. తనకు కీలక పదవి అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర గ్రామీణభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, ప్రభుత్వ విఫ్ యార్లగడ్డ వెంకట్రావు గారు, తెలుగుదేశం పార్టీ పాలిటిబ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు, నక్కా ఆనంద్ బాబు గారు, శాసన సభ్యులు గళ్ళా మాధవి గారు, చదలవాడ అరవింద్ బాబు గారు, జూలకంటి బ్రాహ్మానందరెడ్డి గారు, బూర్ల రామాంజనేయులు గారు, నసీర్ అహ్మద్ గారు, వేగేశ్న నరేంద్రవర్మ గారు, స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, ఆంధ్రప్రదేశ్ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ గారు, SC మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారు, apidcl చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరావు గారు, గుంటూరు డిప్యూటీ మేయర్ సజలా గారు తదితర ముఖ్యలు అందరికీ నా పదవి భాద్యతల స్వీకరణ కార్యక్రమానికి భారీ ఎత్తున వేలాది మంది హాజరై నన్ను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియచేసిన నా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు.