అమెజాన్ కు ఉద్యోగులు షాక్... ఆఫీసుకు రమ్మంటే
రిమోట్ వర్కింగ్‌కు స్వస్తిపలకడంతో ఈ`కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఉద్యోగులు గుడ్‌బై చెబుతున్నారు. కరోనా వ్యాప్తితో వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్‌లకు మళ్లిన కంపెనీలు తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వారానికి కనీసం మూడురోజులు కార్యాలయాల నుంచి పనిచేయాలని అమెజాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగులను కోరింది. వ్యాపారం మెరుగుపడుతుందనే వ్యూహంతో కంపెనీ మే నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది. అయితే ఈ మార్పును జీర్ణించుకోలేని ఉద్యోగులు కంపెనీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులకు విధిగా రావాలనే ఆదేశాలను వ్యతిరేకిస్తూ దాదాపు 2000 మంది ఉద్యోగులు అప్పట్లో నిరసన తెలిపారు. ఇక ఉద్యోగుల కోసం సిద్ధం చేసిన భవనం సిద్దమైనా పలువురు ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావడం లేదని ఆయా ఉద్యోగులకు రెండు రోజుల కిందట కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చింది. తమ టీం సభ్యులతో కలిసి కార్యాలయాలకు విధిగా హాజరు కావాలని కంపెనీ ఆయా టీంలను కోరుతోందని సమాచారం.
తాజా ఆదేశాలపై అమెజాన్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆఫీసులకు హాజరు కావాలని జారీ చేసిన తాజా ఉత్తర్వులపై పలువురు ఉద్యోగులు పెదవివిరిచారు. రిమోట్ వర్కింగ్ నిలిపివేస్ ఏ తాము ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధమని చెబుతున్నారు. మరికొందరు ఉద్యోగులు తమను రిమోట్ రోల్స్‌లో హైర్ చేశారని తాము ఆఫీసులకు రాలేమని తేల్చి చెబుతున్నారు. మరోవైపు రిమోట్ వర్కర్లు వచ్చే ఏడాది ప్రధమార్ధానికి ఆఫీసులకు రావాలని కంపెనీ కోరుతోందని సమాచారం.