ASBL Koncept Ambience
facebook whatsapp X

హైదరాబాద్‌లో మరియట్‌... దేశంలోనే తొలి జీసీసీ

హైదరాబాద్‌లో మరియట్‌... దేశంలోనే తొలి జీసీసీ

అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మారియట్‌ హోటల్స్‌ హైదరాబాద్‌లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ( జీసీసీ) ఏర్పాటుకు ముందుకొచ్చింది. తొలిదశలో 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఈ మేరకు తమ గ్రూప్‌ విస్తరణ ప్రణాళికలపై సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సంస్థ ప్రతినిధులు చర్చించారు. జీసీసీ స్థాపనకు ఆసక్తిని ప్రకటించారు. అనంతరం వారిలో కలిసి మంత్రి శ్రీధర్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆతిథ్య రంగంలో దేశంలోనే తొలి జీసీసీని మారియట్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుండటం సంతోషదాయకం. ఇది  2025 మార్చిలోగా అందుబాటులోకి వస్తుంది.

తెలంగాణలో 10 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఉండగా, ఏటా లక్షన్నర మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు చదువులు ముగించుకుని బయటకు వస్తున్నారు. వీరిలో అత్యధికులకు జీసీసీలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ టెక్‌ యాక్సిలరేటరీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి మారియట్‌ ఆసక్తిగా ఉంది. త్వరలో కార్యరూపం దాల్చనున్న ఏఐ సిటీ తో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లోనూ తమ హోటళ్లను నిర్మిస్తామంది. ఇది రాష్ట్ర ఆర్థిక, సాంకేతికాభివృద్ధికి దోహదపడుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. మేం ఏర్పాటు చేయన్ను గ్రీన్‌ ఫార్మాసిటీ పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుంది. అక్కడ జీరో పొల్యూషన్‌ పరిశ్రమలు ఉంటాయి. ఒకవేళ కొద్దిపాటి రసాయన వ్యర్థాలు వెలువడినా, ఆయా కంపెనీలే సొంత ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో శుద్ధి చేసుకుంటాయి. మరో పది రోజుల్లో అక్కడికి ఎన్ని పార్మా కంపెనీలు వచ్చేది తెలుస్తుంది. ఫార్మాసిటీలో ఔషధ  పరిశ్రమలతో పాటు విద్యా, గృహవసతి కల్పించే సంస్థలు, ఆతిథ్య, వినోద రంగాల సంస్థలన్నీ ఉంటాయి అని మంత్రి వెల్లడిరచారు.
 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :