మధుర మహారాణి మంగమ్మ నవల ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పెమ్మసాని
గతం తెలుసుకున్నప్పుడే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోగలమని ఇందుకు జాతి చరిత్రకు ఆనవాళ్ల లాంటి చారిత్రక నవలలు వెలువడాలని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేకర్ అభిప్రాయపడ్డారు. రచయిత్రి డాక్టర్ సగిలి సుధారాణి రచించిన మధుర మహారాణి మంగమ్మ ( చంద్రగిరి నుంచి మధుర దాకా) నవలను తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఈ నవలా రచనకు చారిత్రక ఆధారాలను సేకరించడంలో రచయిత్రి కృషి ప్రశంసనీయమన్నారు. మన తెలుగు వీరనారీ మంగమ్మ చరిత్రను ఆన్‌లైన్ ద్వారా అందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రచయిత్రి సుధారాణి, సగిలి సుబ్రహ్మణ్యం, లక్ష్మీజ్యోతి, జోత్స్య, పెమ్మసాని రంగారావు పాల్గొన్నారు.
Tags :