వరుణ్ మట్కా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ప్లాట్‌ఫారమ్ అదే..
గత కొద్దిరోజులుగా వరుస ప్లాపులతో బాధపడుతున్న వరుణ్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. మంచి బజ్ మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకులపై ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఇందులో వరుణ్ తేజ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. అయితే థియేటర్లో పెద్దగా సక్సెస్ సాధించినప్పటికీ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం మంచి ఫ్యాన్సీ రేట్ కే వెళ్లాయని టాక్. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను 15 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.
45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన మట్కా చిత్రానికి కేవలం డిజిటల్ హక్కుల ద్వారానే 15 కోట్లు ముట్టాయి. అయితే మిగిలిన 30 కోట్లు థియరిటికల్ బిజినెస్ ద్వారా రికవరీ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ అంత రికవరీ చేయడం కష్టం అని అనిపిస్తోంది. ఈ వారంలో ఈ చిత్రానికి సుమారు 14.3 కొట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటాలి అంటే 15 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంది. వీకెండ్ డేస్ లోనే ఈ చిత్రం పర్ఫామెన్స్ ఇంత వీక్ గా ఉంటే ఇక వీక్ డేస్ లో చాలా కష్టమనే చెప్పాలి. మామూలుగా సినిమాలు యావరేజ్ గా ఆడితే 30 రోజుల్లోగా ఓటీటీలోకి వచ్చేస్తాయి. ఈ విధంగా తీసుకుంటే మట్కా డిసెంబర్ రెండవ లేక మూడవ వారంలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉంది.