ASBL Koncept Ambience
facebook whatsapp X

The Girl Friend : రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్ కు డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు

The Girl Friend : రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్ కు డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, (Rashmika Mandanna)టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind Presents) సమర్పణలో గీతా ఆర్ట్స్,(Geetha Arts) మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. టీజర్ చూసిన సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 ఈవెంట్ లో అప్రిషియేట్ చేశారు.

డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ- డైరెక్టర్ రాహుల్ "ది గర్ల్ ఫ్రెండ్" టీజర్ చూపించాడు. రశ్మిక పర్ ఫార్మెన్స్, క్లోజప్ షాట్స్, ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. రాహుల్ తన యాక్టర్స్ ను బాగా సెలెక్ట్ చేసుకుంటాడు. అని అన్నారు. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రస్తుతం చివరి దశ  షూటింగ్ లో ఉంది.  
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :