ASBL Koncept Ambience
facebook whatsapp X

మెకానిక్ రాకీ వాయిదా.. కార‌ణ‌మేంటంటే..

మెకానిక్ రాకీ వాయిదా.. కార‌ణ‌మేంటంటే..

విశ్వ‌క్సేన్(Viswaksen) హీరోగా ర‌వితేజ ముళ్లపూడి(Ravi teja Mullapudi) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా మెకానిక్ రాకీ(Mechanic Rocky). రామ్ తాళ్లూరి(Ram Thalluri) నిర్మించిన ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో విశ్వ‌క్ కు జోడీగా మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) న‌టిస్తోంది. భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ గ‌తంలో ప్ర‌క‌టించారు.

కానీ ఇప్పుడీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్ప‌టికే రెండుసార్లు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విశ్వ‌క్ ఈ సినిమాతో ఎలాగైనా క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకోవాల‌ని ఎంతో క‌సితో ఉన్నాడు. ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా మొద‌లుపెట్టారు. అయితే ఈ సినిమాకు పోటీగా ల‌క్కీ భాస్క‌ర్(Lucky Bhaskar) కూడా అక్టోబ‌ర్ 31నే రిలీజ్ కానుంది.

వెంకీ అట్లూరి(Venky Atluri) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతుంది. అయితే ల‌క్కీ భాస్క‌ర్, మెకానిక్ రాకీ సినిమాలు రెండూ కూడా మీడియం బ‌డ్జెట్ సినిమాలే. దీపావ‌ళికి ఈ రెండు సినిమాలు రిలీజైనా పెద్ద న‌ష్ట‌మేమీ ఉండ‌దు. కానీ మెకానిక్ రాకీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌వ‌డానికి మ‌రికొంత టైమ్ ప‌ట్ట‌నుండ‌టంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విశ్వ‌క్ పోస్టర్ ఒక‌టి మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్ట‌ర్ లో రిలీజ్ డేట్ లేక‌పోవ‌డంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత ఊపిరి పోసిన‌ట్లైంది. త్వ‌రలోనే మేక‌ర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారంటున్నారు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :