ASBL Koncept Ambience
facebook whatsapp X

మీనాక్షి హిట్టు కొట్టాల్సిందే!

మీనాక్షి హిట్టు కొట్టాల్సిందే!

టాలీవుడ్ లో త‌క్కువ కాలంలో ఎక్కువ ఛాన్సులు అందుకున్న హీరోయిన్ల‌లో మీనాక్షి చౌద‌రి కూడా ఉంది. క‌నీసం ఈ ఇయ‌ర్ అమ్మ‌డి నుంచి 5 సినిమాలు వ‌చ్చేంత బిజీలో మీనాక్షి ఉంది. ఛాన్సులైతే వ‌స్తున్నాయి కానీ త‌న‌కు డిజైన చేసిన పాత్ర‌లు మ‌రీ అన్యాయంగా ఉన్నాయి. గుంటూరు కారంలో ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడు మ‌హేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింద‌నుకున్నారంతా.

కానీ సినిమాలో చూస్తే మ‌హేస్ కు ఆమ్లెట్ ఇవ్వ‌డానికి, జ‌య‌రాంకు మందు పోయ‌డానికి త‌ప్ప ఆమెను స‌రిగా త్రివిక్ర‌మ్ వాడుకోలేదు. ఇక ఇప్పుడు విజ‌య్ గోట్ సినిమాలో కూడా భ‌లే ఛాన్స్ కొట్టేసింద‌నుకుంటే మ‌రోసారి అమ్మ‌డి ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. ఒక సాంగ్ లో విజ‌య్ తో క‌లిసి డ్యాన్స్ చేసింది.

అది కూడా చ‌ప్ప‌గా రాంగ్ ప్లేస్‌మెంట్‌లో ఉంటుంది. అంతేకాదు సెకండాఫ్ లో అమ్మ‌డి క్యారెక్ట‌ర్ కి ఇచ్చే ట్విస్ట్ ఆడియ‌న్స్  ను షాక్ కు గురి చేస్తుంది. దీన్ని బ‌ట్టి చూస్తుంటే మీనాక్షి ఇక‌పై మీడియం రేంజ్ హీరోల సినిమాల మీదే ఆశ‌లు పెట్టుకోవాలి. వ‌చ్చే నెలాఖ‌రుని ల‌క్కీ భాస్క‌ర్, మెకానిక్ రాకీ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాల‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఈ రెండూ హిట్ అయితే త‌ప్ప మీనాక్షికి కోరుకున్న బ్రేక్ ద‌క్క‌దు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :