పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి
టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్(Sushanth) తో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) గత కొన్నేళ్లుగా లవ్ లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి త్వరలోనే అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుశాంత్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై మీనాక్షి టీమ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని, సుశాంత్-మీనాక్షి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని ఆమె టీమ్ చెప్పగా, తాజాగా ఈ విషయంలో మీనాక్షి కూడా రెస్పాండ్స్ అయింది. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తన రిలేషన్షిప్ గురించి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి రూమర్లు రావడం కామనైపోయిందని మీనాక్షి చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే ఈ విషయంలో సుశాంత్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరూ కలిసి 2021లో ఇచ్చట వాహనములు నిలపరాదు(Ichata Vahanamulu Nilaparadhu) అనే సినిమా చేశారు. ముంబైలోని యాక్టింగ్ స్కూల్ లో సుశాంత్ వర్క్ షాప్ చేస్తున్నప్పుడు, అక్కడ మీనాక్షిని చూసి తన సినిమాలో సుశాంత్ ఆఫర్ ఇచ్చాడని రీసెంట్ గా అన్స్టాపబుల్ షో లో మీనాక్షి వెల్లడించిన విషయం తెలిసిందే.