అన్ని సినిమాలు చేస్తే ఒకటే హిట్
హర్యానా భామ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) నుంచి ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలు రిలీజయ్యాయి. ఈ మధ్య ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలతో వచ్చిన హీరోయిన్ మరెవరూ లేరనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న మీనాక్షి హిట్స్ అందుకోవడంలో మాత్రం తీవ్ర నిరాశను ఎదుర్కొంటుంది.
ఈ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాతో మొదటిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మీనాక్షి ఆ సినిమాతో సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళ మూవీ సింగపూర్ సెలూన్(Singapur Saloon) తో వచ్చింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతంతమాత్రంగానే నిలిచింది. తర్వాత విజయ్(Vijay) సరసన ది గోట్(the Goat) లో నటించింది. గోట్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ టాక్ మాత్రం బాలేదు. దానికి తోడు ఆ సినిమా తర్వాత మీనాక్షికి తమిళం నుంచి ఆఫర్లు వచ్చింది కూడా లేదు.
ఆ తర్వాత కాస్త గ్యాప్ తర్వాత మీనాక్షి నుంచి వరుసగా మూడు సినిమాలొచ్చాయి. అందులో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) సరసన నటించిన లక్కీ భాస్కర్(Lucky Bhaskhar) మాత్రం టాక్ తో పాటూ కమర్షియల్ గా కూడా వర్కవుట్ అయి ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో మీనాక్షి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
లక్కీ భాస్కర్ హిట్ తర్వాత మీనాక్షి నుంచి వచ్చిన మట్కా(matka) తీవ్రంగా నిరాశ పరిచింది. దాని తర్వాత విశ్వక్(Viswak) తో చేసిన మెకానిక్ రాకీ(mechanic rocky) సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు కానీ ఫర్వాలేదనిపిస్తుంది. లాంగ్ రన లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. మొత్తానికి మీనాక్షి ఈ ఇయర్ ఆరు సినిమాలు చేస్తే అందులో ఒక్కటి మాత్రమే తనకు మంచి పేరు తీసుకొచ్చింది.