ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇది నగర వాసులకే కాదు... తెలంగాణకు గర్వకారణం

ఇది నగర వాసులకే కాదు... తెలంగాణకు గర్వకారణం

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్‌ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తోందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  మెట్రో రైలు ఏడేళ్లు పూర్తిచేసుకుందని, ఇది నగరవాసులకే కాకుండా తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. మెట్రో రైలు మొదటి దశ నిర్మాణం సమయంలో నా దిష్టి బొమ్మలు దహనం చేశారు. అలా చేసినవాళ్లే నేడు పూలదండలతో సత్కరిస్తున్నారు. ముంబయి, చైన్నెలో భారీగా ఖర్చు చేసి మెట్రో విస్తరిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన నగరంలో విస్తరణ లేకపోవడం వల్ల మూడో స్థానంలో ఉన్నాం. విస్తరణపై సీఎం రేవంత్‌ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించాం. మొత్తం మూడు కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కి.మీ ప్లాన్‌ చేశాం. ప్రస్తుతం ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపించాం. మేడ్చల్‌ వైపు కారిడార్‌ కోసం డిమాండ్లు వస్తున్నాయి. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తాం అని అన్నారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :